PLEASE VISIT http://www.telugustockmarket.com/ for most accurate stock tips
TELUGUSTOCKMARKET.COM - FIRST EVER STOCKMARKET AND FINANCIAL PORTAL IN TELUGU
తెలుగు లో ప్రప్రధమ స్టాక్ మార్కెట్ పోర్టల్ .
సమగ్ర సమాచారం కొరకు విచ్చేయండి www .telugustockmarket.com
- ఇకపై విదేశాలకు అధిక సొమ్మును తీసుకెళ్ళవచ్చుః ఆర్‌బీఐ
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నట్లైతే మీకో శుభవార్త. ఇకపై మీరు విదేశాలకు వెళ్ళేటట్లైతే దాదాపు మూడు వేల డాలర్ల మేరకు విదేశీ నగదును చేతబట్టుకుని వెళ్ళవచ్చని భారతీయ రిజర్వు బ్యాంకు మంగళవారం ప్రకటించింది. ఈ నగదు మార్పిడి తక్షణమే అమలులోకి వచ్చేసిందని ఆర్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
గతంలో విదేశాలకు వెళ్ళేవారు కేవలం రెండు వేల డాలర్ల మేరకే తీసుకువెళ్ళే వెసలుబాటుండేంది, కాని ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రకటించిన ప్రకటన మేరకు ఇకపై మూడు వేల డాలర్ల మేరకు తీసుకువెళ్ళవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
విదేశీ నగదు నియమాలలో మార్పులు చేయడం వలన విదేశీయాత్ర చేపట్టే వారికి వెసలుబాటు కలిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గతంలోలా ఆర్‌బీఐ అనుమతి లేకుండానే ఫారెక్స్ డీలర్ల నుంచి మూడు వేల అమెరికన్ డాలర్లను లేదా ఇంతే విలువైన ఇతర విదేశీ నగదును మీ వెంట తీసుకువెళ్ళే సౌలభ్యం కలిగింది.
లిబియా లేదా ఇరాక్ వెళ్ళే వారికి ఐదు వేల అమెరికన్ డాలర్లు లేదా ఇతర విదేశీ నగదును ఇంతే మొత్తంలో తీసుకు వెళ్ళవచ్చు. ఇరాన్, రష్యా, సీఐఎస్ దేశాలకు ప్రయాణించే ప్రయాణీకులకు ఎలాంటి మార్పులు లేవని అధికార వర్గాలు తెలిపాయి.